– బీహార్ ఓటర్ల జాబితా సిత్రాలు
పాట్నా : బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి.ఈ నెల 1వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అప్‌లోడ్ చేసిన ముసాయిదా జాబితా తప్పుల తడకగా కన్పిస్తోంది. 0, 00, 000 ఇంటి నెంబర్లతో ఏకంగా 2,92,048 మంది ఓటర్లు ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. ఓటర్ల జాబితాలలో కొన్ని తప్పులు దొర్లిన మాట నిజమేనని బీహార్ ప్రధాన ఎన్నికల కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు అంగీకరించారు. ‘కొన్ని సందర్భాలలో ఓటర్లు ఇంటి నెంబరు రాయలేదు. అందువల్ల ఓటర్ల ఇంటి నెంబరును సున్నాగా చూపడం జరిగింది. దానిని సరిచేసుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ వెబ్‌సైటు ఇప్పటికీ కల్పిస్తోంది. తప్పులను సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం’ అని డిప్యూటీ చీఫ్ ఎలక్టొరల్ అధికారి అశోక్ ప్రియదర్శి తెలిపారు. ప్రతిపక్ష నేతలు ఇప్పటికే సర్ ప్రక్రియపై విమర్శలు కురిపిం చారు. ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించారని వారు ఆరోపించారు. ముసా యిదా ఓటర్ల జాబితాలో అరవై ఐదు లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. కాగా బీహార్‌లోని మగధ్, పాట్నా ప్రాంతాలలో ‘0’ ఇంటి నెంబరుతో అత్యధిక ఓటర్లు కన్పించారు. ఔరంగాబాద్ జిల్లాలోని ఓబ్రా స్థానంలో అత్యధికంగా 6,637 మంది అలాంటి ఓటర్లు ఉండగా పుల్వారీ (5,905), మనేర్ (4,602), ఫర్బెస్‌గంజ్ (4,155), దానాపూర్ (4,063), గోపాల్‌గంజ్ (3,957), పాట్నా సాహిబ్ (3,806), హాజీపూర్ (3,802), దర్భాంగా (3,634), గయ టౌన్ (3,561)లో కూడా సున్నా ఇంటి నెంబరుతో గణనీయ సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తంమీద 15 నియోజకవర్గాలలో ఒక్కో స్థానంలో మూడు వేల కంటే ఎక్కువ మంది ఓటర్లు సున్నా నెంబరు ఇంటిలో
ఉంటున్నారు.
ఇంటి నెంబర్ ‘0’లో ఓటర్లు 2.92 లక్షలు!
- Advertisement -
- Advertisement -