నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ల జారీ ప్రభుత్వం జారీ చేసిన విధానాన్ని స్వాగతిస్తున్నామని, కానీ జీవో 252లో పలు లోపాలు ఉన్నాయని సవరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF) కోరింది. ఈమేరకు మంగళవారం హైదరాబాద్ సచివాలయంలో సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ను కలిసి TWJF సభ్యులు వినతి పత్రాన్ని అందజేసింది.
ప్రధానంగా ఈ జీవోలో జర్నలిస్టులను వర్గీకరించారని లేఖలో పేర్కొన్నారు. రిపోర్టర్లకు అక్రెడిటేషన్, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు పేరుతో గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. దీని మూలంగా డెస్క్ జర్నలిస్టులకు నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీరుతో రైల్వే పాసులను జర్నలిస్టులు కోల్పోయారు. ఆర్టీసీ ద్వారా ఇచ్చే రాయితీ టోల్గేట్ ఫీజు కారణంగా 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గిందన్నారు. ఇప్పుడు జీవో 252 ద్వారా డెస్క్ జర్నలిస్టులు మొత్తం బస్సు పాస్ ఫెసిలిటీ ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డెస్క్ జర్నలిస్టుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వారి ఆందోళన సరైనదిగా ఫెడరేషన్ భావిస్తోందని స్పష్టం చేసింది.
ఇకపోతే కొత్త జీవో 252 మూలంగా చిన్న, మధ్య తరహా పత్రికలు అక్రెడిటేషన్ లను కోల్పోతున్నాయి. అక్రిడేషన్ కార్డులు కూడా గతంతో పోలిస్తే భారీగా తగ్గించారు.. ఈ నిర్ణయంతో వందలాదిమంది వర్కింగ్ జర్నలిస్టులకు కార్డులు అందకుండా పోతాయని తెలిపారు. కావున ఈ విషయాలను పరిశీలించి జీవో 252 ను సవరించాలని, తద్వారా డెస్క్ జర్నలిస్టులు, చిన్న,మధ్య తరహా పత్రికలను ఆదుకోవాలని, అతి TWJF కోరుతోంది. అర్హులైన వారందరికీ అక్రిడే షన్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగా దీర్ఘకాళికంగా పెండింగ్ లో ఉన్న ఇండ్ల స్థలాలు ఇవ్వాలనీ, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య విధానాన్నే జర్నలిస్టులకు అమలు చేయాలనీ, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలనీ, మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట రవాణా వసతి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలనీ ప్రభుత్వానికి TWJF విజ్ఞప్తి చేసింది.





