పీసీసీ డెలికేట్ విట్టల్ రెడ్డి..
నవతెలంగాణ – బిచ్కుంద
జుక్కల్ నియోజకవర్గంలో కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు లేవని ప్రతిపక్ష పార్టీ వారు జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధిని జీర్ణించుకోలేక ఏదో ఒకటి సృష్టించి పేపర్లలో రాయిస్తున్నారని పిసిసి డెలికేట్ విట్టల్ రెడ్డి అన్నారు. బిచ్కుంద పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో విలేకరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ దినపత్రికలో వచ్చిన కథనం స్థానిక శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని పార్టీని వీడి పదవులకు రాజీనామాలు చేస్తున్నారని అసత్యపు వార్త రాశారని రాసిన వార్త అబద్దమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ లోని క్యాంప్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తున్నారని నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ఎప్పటికప్పుడు స్థానిక నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు.
ప్రతిపక్ష పార్టీ వారికి ఏ పని లేక అసత్య ప్రచారం చేస్తూ బురద చల్లేందుకు పూనుకున్నారని రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గ్రామస్థాయి నుండి జిల్లా పరిషత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను విజయపథంలో నడిపించి తమ సత్తా చాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దర్పల్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మున్నూరు నాగ్నాథ్, నాయకులు వెంకట్రాంరెడ్డి, నౌషా నాయక్, రవి పటేల్, సాహిల్ షెట్కార్, అశోక్, దర్పల్ సంజు, ఉత్తమ్, ఖలీల్, బాలక్రిష్ణ, సిద్ధప్ప పటేల్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
కాంగ్రెస్ లో నాయకులు మధ్య విభేదాలు లేవు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES