Saturday, September 20, 2025
E-PAPER
Homeజాతీయంఓట్ల చోరీపై ప‌క్క ఆధారాలున్నాయి: రాహుల్ గాంధీ

ఓట్ల చోరీపై ప‌క్క ఆధారాలున్నాయి: రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఓట్ల చోరీ ఉదంతంపై కేంద్ర ఎన్నికల సంఘంపై ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌త్యేక సాప్ట్‌వేర్ ద్వారా ఇండియా బ్లాక్ అనుకూల ఓట్ల‌ను భారీగా తొల‌గిస్తున్నార‌ని ఢిల్లీ మీడియా స‌మావేశంలో ఆరోపించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఈసీపై విరుచుకుప‌డ్డారు. క‌ర్నాట‌క‌లో ఓట్ల చోరీ వ్య‌వ‌హారంపై సీఐడీ విచార‌ణ‌ను వేగ‌వంతం చేసిందని, వాళ్లు ఉప‌యోగించిన సెల్‌ఫోన్‌ నెంబ‌ర్ల‌ల‌ను త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డుతాయ‌న్నారు. దీంతో ఓట్ల చోరీ బాగోతంలో ఈసీ, బీజేపీ పాత్ర ఏంటో బ‌హిర్గ‌తం కానుందని తెలిపారు. విచార‌ణ‌లో నిజాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్వ‌ర్ కుమార్ భ‌య‌ప‌డుతున్నార‌ని, అందుకే విచార‌ణ‌లో భాగంగా సీఐడీ కోరిన స‌మాచారాన్ని ఇవ్వ‌డంలేద‌ని రాహుల్ మండిప‌డ్డారు. ఓట్ల చోరీ వ్య‌వ‌హారంపై త‌మ వ‌ద్ద ప‌క్క ఆధారాలున్నాయ‌ని, త్వ‌ర‌లోనే మ‌రోసారి హైడ్రోజ‌న్ బాంబు పేల‌బోతుంద‌ని కేర‌ళ విలేఖ‌ర్ల స‌మావేశంలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -