Saturday, May 3, 2025
Homeరాష్ట్రీయంసీఎం పదవికే గ్యారంటీ లేదు

సీఎం పదవికే గ్యారంటీ లేదు

– మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవ తెలంగాణ-సూర్యాపేట
ఎన్ని రోజులు ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడో రేవంత్‌రెడికే గ్యారంటీ లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ గురించి కామెంట్‌ చేసేటోళ్లకు బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ఓ చెంపపెట్టు లాంటిదన్నారు. సభలో కేసీఆర్‌ నోట రేవంత్‌ మాట రాలేదనే అక్కసు ఆయనలో ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్‌కు కాంగ్రెస్‌ పార్టీ కన్నా వ్యక్తిగత ప్రచారమే ఎక్కువ అయిందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. ఆనాడు కాంగ్రెస్‌ తెలంగాణను ఇచ్చింది ప్రేమతో కాదని, భయంతో అని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్‌ పేరు మరిచి పోతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క మంచి పని చేయని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలెందుకు గుర్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. రేవంత్‌ వల్ల బాధించబడిన వారే ఆయనను ఓడించేందుకు గుర్తు పెట్టుకుంటారన్నారు. కేసీఆర్‌ దీక్ష సమయంలో విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్‌ కారణం కాదా అని ప్రశ్నించారు. అందుకే ముమ్మాటికీ తెలంగాణకు మెయిన్‌ విలన్‌ కాంగ్రెస్సే అన్నారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కెేసీఆర్‌ మాటలను ప్రజలంతా స్వాగతించారని తెలిపారు. అధికారం కోసం దిగజారే నైజం రేవంత్‌ రెడ్డిదని విమర్శించారు. పదేండ్లు మాదే అధికారమన్న వాళ్లకి కేసీఆర్‌ ఫాంహౌస్‌లో ఉంటే భయమెందుకని ప్రశ్నించారు. కేసీఆర్‌పై చిల్లర మాటలు మాని హామీల అమలుపై దృష్టి పెట్టాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img