Saturday, November 1, 2025
E-PAPER
Homeజాతీయంప్రజాస్వామ్య దేశాల్లో హింసకు చోటు లేదు : తేజస్వియాదవ్‌

ప్రజాస్వామ్య దేశాల్లో హింసకు చోటు లేదు : తేజస్వియాదవ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : త్వరలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లోని మొకామాలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో జన సురాజ్‌ పార్టీ కార్యకర్తలకు, ఎన్‌డిఎ కూటమి కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో జన సురాజ్‌ పార్టీ కార్యకర్త దులార్‌ చంద్‌ యాదవ్‌ చనిపోయాడు. ఈ ఘటనను రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) నేత తేజస్వియాదవ్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశాల్లో హింసకు చోటు లేదు. ఆయుధాలతో 40 – వెహికల్‌ కాన్వారు వెళ్లడం చూసి మేము ఆశ్చర్యపోయాము. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? రాష్ట్ర పరిపాలన ఏం చేస్తోంది? దీనిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? అక్కడ హత్య జరిగింది.

దీనికి సాక్షులు చాలామంది ఉన్నారు. కానీ పరిపాలన మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. నిశ్శబ్దంగా ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు లేదు. గూండాలను రక్షిస్తున్నదెవరు? అని ఆయన ప్రశ్నించారు.కాగా, ఈ ఘటనపై లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు జన్‌శక్తి జనతాదళ్‌ (జెజెడి) చీఫ్‌ తేజ్‌ ప్రతాప్‌యాదవ్‌ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఎవరికీ భద్రత లేదు అని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం నిద్రపోతోంది అని తీవ్రంగా విమర్శించారు. : త్వరలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లోని మొకామాలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో జన సురాజ్‌ పార్టీ కార్యకర్తలకు, ఎన్‌డిఎ కూటమి కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో జన సురాజ్‌ పార్టీ కార్యకర్త దులార్‌ చంద్‌ యాదవ్‌ చనిపోయాడు. ఈ ఘటనను రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) నేత తేజస్వియాదవ్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశాల్లో హింసకు చోటు లేదు.

ఆయుధాలతో 40 – వెహికల్‌ కాన్వారు వెళ్లడం చూసి మేము ఆశ్చర్యపోయాము. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? రాష్ట్ర పరిపాలన ఏం చేస్తోంది? దీనిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? అక్కడ హత్య జరిగింది. దీనికి సాక్షులు చాలామంది ఉన్నారు. కానీ పరిపాలన మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. నిశ్శబ్దంగా ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు లేదు. గూండాలను రక్షిస్తున్నదెవరు? అని ఆయన ప్రశ్నించారు.కాగా, ఈ ఘటనపై లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు జన్‌శక్తి జనతాదళ్‌ (జెజెడి) చీఫ్‌ తేజ్‌ ప్రతాప్‌యాదవ్‌ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఎవరికీ భద్రత లేదు అని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం నిద్రపోతోంది అని తీవ్రంగా విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -