– ఇరాన్ మత పెద్ద ఖమేని వ్యాఖ్యలు
టెహరాన్: అమెరికాతో జరిగే అణు చర్చల వల్ల ఎలాంటి ఫలితం వస్తుందని భావించడం లేదని ఇరాన్ మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేని వ్యాఖ్యానించారు. ఇరాన్ చేపట్టిన యురేనియం శుద్ధి కార్యక్రమాలపై ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య ప్రతిష్టంభనను పరిష్కరించే లక్ష్యంతో ఈ చర్చలు చేపట్టారు. కానీ ఎలాంటి ఫలితం వస్తుందని తాము భావించడం లేదని, ఏం జరుగుతుందో కూడా తెలియదని ఖమేనీ వ్యాఖ్యానించారు. యురేనియం శుద్ధిని చేపట్టేందుకు ఇరాన్‌కు గల హక్కును నిరాకరించడమనేది అతి పెద్ద తప్పు కాగలదని అన్నారు. ఏప్రిల్ 12వ తేదీ నుండి ఇరాన్, అమెరికాలు ఒమన్ మధ్యవర్తిత్వంలో నాలుగు దఫాలు చర్చలు జరిపాయి. మే 11న చివరిసారిగా సమావేశం జరిగింది, కానీ మరోసారి చర్చలు జరపాలని భావిస్తున్నట్లు ఇరుప పక్షాలు ధృవీకరించాయి. కాగా, ఇరాన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకోగలమని ఆశిస్తున్నట్లు ఈనెల 20న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సెనెట్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. అణు శీర్షానికి 90శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం కావాల్సి వుండగా, ఇరాన్ ప్రస్తుతం 60శాతం వరకు శుద్ధి చేస్తోంది. అణ్వాయుధాలను సముపార్జించుకోవడానికే ఇరాన్ ఇదంతా చేస్తోందని పశ్చిమదేశాలు విమర్శిస్తున్నాయి. కాగా తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకేనని ఇరాన్ స్పష్టం చేసింది. యురేనియం శుద్ధి చేయడానికి తమకు గల హక్కుపై చర్చించేందుకు వీల్లేదని ఇరాన్ పదే పదే చెబుతూ వస్తోంది. ఒక శాతం శుద్ధి సామర్ధ్యాన్ని కూడా అనుమతించేది లేదని అమెరికా స్పష్టం చేస్తోంది. ఈ చర్చల్లో పాల్గొనే అమెరికా ప్రతినిధి బృందం ఇలాంటి చెత్త మాట్లాడకుండా సంయమనం పాటించాలని ఖమేని సూచించారు.
అమెరికాతో చర్చలతో ఉపయోగం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES