Wednesday, March 18, 2026
E-PAPER
Homeజాతీయంప్రజా జీవితంలో విర‌మ‌ణ ఉండ‌దు: ప్రధాని మోడీ

ప్రజా జీవితంలో విర‌మ‌ణ ఉండ‌దు: ప్రధాని మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రధాని మోడీ కూడా రాజ్యసభలో బుధవారం పదవీ విరమణ చేయనున్న ఎంపీలనుద్దేశించి మాట్లాడారు. ఎంపీలనుద్దేశించి రాజకీయాలకు ముగింపు ఉండదని అన్నారు. ఈ సందర్బంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ‘సభలో వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయి. వాటిలో ప్రతి సభ్యుడు ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తాడు. ఇలాంటి సందర్భాల్లో పార్టీలకు అతీతంగా ఒకరిపై ఒకరికి గౌరవ భావం ఏర్పడుతుంది. తమ పదవీ కాలం ముగిసి సభ నుండి నిష్క్రమిస్న్ను నేతలకు నేను చెప్పేదేమిటంటే రాజకీయాలకు ముగింపు ఉండదు. భవిష్యత్తు మీ కోసం వేచి ఉంది. మీ అనుభవం, మీరు చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి అని అన్నారు.
కాగా, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే నేడు పదవీ విరమణ చేయనున్న ఎంపీలకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నవారు అలసిపోరు. విరమించుకోరు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని దేవెగౌడపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘నాకు దేవెగౌడ 54 ఏళ్లకు పైగా తెలుసు. నేను ఆయనతో కలిసి చాసార్లు పనిచేశాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. బహుశా దేవెగౌడ మమ్మల్ని ప్రేమించి.. మోడీ సాబ్ తో పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -