నవతెలంగాణ-హైదరాబాద్: ఎటువంటి FIRలకు భయపడేది లేదని ఆర్జేడీ నేత తేజిస్వీయాదవ్ అన్నారు. ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలు బీహార్ రాష్ట్రంలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాము నిజాలు మాట్లాడుతుంటే ఎన్డీయే కూటమి సర్కార్ భయపడుతుందని ఎద్దేవా చేశారు. కానీ తమపై ఎన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసినా భయపడే ప్రశస్తే లేదని, ఎందుకంటే తాము మాట్లాడుతున్నది వాస్తవాలు అని కతిహర్ మీడియా సమావేశంలో తేజిస్వి యాదవ్ చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో అభ్యంతరకరమైన పోస్ట్ పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేశారనే ఆరోపణలపై.. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో RJD నాయకుడు తేజస్వి యాదవ్‌పై FIR నమోదైంది. మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ రామ్‌జీ నరోటే శుక్రవారం తేజస్వి యాదవ్‌పై ఫిర్యాదు చేశారు.
భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్స్ 196(1)(a)(b), 356(2)(3), 352, 353(2) కింద గడ్చిరోలి పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేశారు. శుక్రవారం గయాజీ జిల్లాకు ప్రధాని మోడీ పర్యటనకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్‌లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.