నవతెలంగాణ-హైదరాబాద్: ఇండస్ట్రీలో కొంతమందికి నాపై వ్యతిరేకత ఉంది. ఇప్పుడది చాలా క్లియర్‌గా అర్థం అవుతోంది. అందుకే నాపై కుట్ర చేశారని శివాజీ ఆరోపించారు దండోరా సినిమా ఫంక్షన్‌లో హీరోయిన్లు వస్త్రాధారణపై నటుడు శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ కమిషన్ ముందు హాజరై, ఆయన మాటలపై వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.తండ్రి పాత్రలు చేస్తున్నాను కాబట్టి బిడ్డలకు చెప్పినట్లు చెప్పా. ఇందులో తప్పుడు ఉద్దేశం ఏమీ లేదు. ఏదేమైనా రెండు మిస్టేక్స్ జరిగాయి. ఇప్పటికే సారీ కూడా చెప్పాను. దయచేసి దీనిని ఇంతటితో ఆపేయండి అని మహిళా కమిషన్ ఎదుట శివాజీ వాపోయారు. ‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.
ఇండస్ట్రీలో నాపై వ్యతిరేకత ఉంది..అందుకే తనపై కుట్ర: నటుడు శివాజీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



