Friday, September 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇక‌పై పాలస్తీనా ఉండ‌దు: ఇజ్రాయెల్ ప్రధాని

ఇక‌పై పాలస్తీనా ఉండ‌దు: ఇజ్రాయెల్ ప్రధాని

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాలస్తీనా దేశంగా ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఖతార్‌లో హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలు ఇలా నడుస్తుండగానే రెండు రోజుల గ్యాప్‌లో వెస్ట్ బ్యాంక్‌లోని మాలే అడుమిమ్ సెటిల్‌మెంట్‌ ప్రాంతాన్ని నెతన్యాహు సందర్శించారు. ఇకపై ఈ భూభాగం తమదేనని ప్రకటించారు. ఇక్కడ వేలాది కొత్త గృహాలు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.

మ‌రోవైపు వచ్చే యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా రాజ్యం గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ దేశాలు మద్దతు తెలిపాయి. ఇందుకోసం కసరత్తు చేస్తుండగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బాంబ్ పేల్చారు. ఇక పాలస్తీనా దేశమే ఉండబోదని ప్రకటించారు. ఒకవేళ మిత్రదేశాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తే మాత్రం ఇజ్రాయెల్ ఒంటరిగా నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -