నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాల్లో పశ్చిమాసియా యుద్ధంపై అధికార పక్షానికి, విపక్షాలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈక్రమంలోనే మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ మాట్లాడారు.యుద్ధాన్ని తాము రాజకీయం చేయడంలేదని, దాని ప్రభావం దేశంపై అధికంగా ఉందని, దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం మొదలైనా కానుంచి సిలిండర్ల ధరలు పెరిగాయని, దీంతో పలు సవాల్‌లు ఎదుర్కొల్సి వచ్చిందన్నారు. యుద్ధ పరిస్థితులను రాజకీయం చేయడంలేదని, రోజురోజుకు యుద్ధం కారణంగా పెరిగిపోతున్న కష్టాలకు, సమస్యలకు పరిష్కారం అడుగుతున్నామని మోడీ సర్కార్‌ను ఆమె ప్రశ్నించారు. ఈ తరహా పరిస్థితుల్లో భవిష్యత్ వ్యూహాలపై తామంత కలిసి పనిచేయడానికి వీలుగా ప్రభుత్వం తన సంసిద్ధతను స్పష్టంగా ప్రకటించాలని పార్లమెంట్ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ సూచించారు.
యుద్ధాన్ని తాము రాజకీయం చేయట్లే: ఎంపీ ప్రియాంకాగాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



