సంక్రాంతి సినిమాలో కామెడియన్ సుధాకర్ గోడ దూకి హీరో వెంకటేశ్ ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తాడు. దొంగ అలికిడిని గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకుం టారు. కొట్టేందుకు ప్రయత్నిస్తారు. అంతలోనే హీరో వచ్చి అతన్ని కొట్టకుండా వారిస్తాడు. దొంగతనం ఎందుకు చేస్తున్నావు అంటే… ‘అన్నం తినక కొన్ని రోజులైంది. ఆకలి బాధ బరించలేక దొంగతనానికి వచ్చాను’ అని చెబుతాడు. అతనికి కడుపునిండా భోజనం పెడతారు. ‘దొంగతనం మానేసి ఏదైనా పని ఇస్తాం చేస్తావా?’ అని సుధాకర్‌ను అడుగుతారు.. ‘సచ్చినా దొంగతనం చేయను’ అంటాడు. అయితే అందరూ ఇలాగే ఉంటారునుకోలేం. నేరాలు, ఘోరాలకు పాల్పడే దొంగలు ఎంతో మంది ఉంటారు. స్టూవర్టుపురం దొంగల గురించి కూడా మూడు నాలుగు సినిమాలే వచ్చాయి. ఈ నైపుణ్యమైన కళ…సీసీ కెమెరాలు రావడంతో అవి తగ్గినట్టు కనిపించినా… చాలా తెలివిగా, చాకచాక్యంగా దొంగతనం చేస్తున్నారు. మార్కెట్‌లోకి సెల్‌ఫోన్లు వచ్చిన కొత్తలో వాటిని లాక్కెల్లేవాళ్లు. మారుతున్న కాలానికి దొంగలు అప్‌డేట్ అయ్యారు. ఇప్పుడు పని ప్రదేశాల్లో వాచ్‌మెన్లు ఉంటున్న గుడిసెల్లో చొరబడి సెల్‌ఫోన్లు ఎత్తుకెళుతున్నారంటూ మాదన్నపేట్ పోలీసు ఒకరు చెప్పారు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న తల్లిదండ్రుల వద్దకు కూతురు వచ్చింది. ఆ రోజు తల్లిదండ్రుల వద్దనే ఉన్నది. అదే రోజు రాత్రి ఓ దొంగ జొరబడి ఆమె బ్యాగ్ ఎత్తుకెళ్లాడు. అందులో విలువైన పత్రాలతోపాటు స్మార్ట్‌ఫోన్, చిన్న ఫోన్ ఉన్నది. వెంటనే తేరుకుని దొంగను వెంబడించారు. దొంగ బైక్‌పై పారిపోయాడు. వెంటనే వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే… దొంగ సెల్‌ఫోన్లను ఉంచుకుని, ఆ బ్యాగ్‌ను ఆ గుడిసె సమీపంలో వదిలేసే వెళ్లిపోయాడు. బ్యాగ్ తెరిచి చూడగా అన్ని వస్తువులు ఉన్నాయి. సెల్‌ఫోన్లు తప్ప. అందుకు కూతురు సంతోషించింది. ఇది ఓ దొంగ మనసు అని నవ్వుకున్నారు.
– గుడిగ రఘు
దొంగ మనసు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES