-సర్పంచ్ రూ.2.50 లక్షలు…వార్డు సభ్యుడికి రూ.50 వేలు
నవతెలంగాణ-మల్హర్ రావు
పంచాయ తీరాజ్ చట్టంలోని 237(3)ల ద్వారా సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చును నిర్ణయించారు.2011 జనాభా లెక్కల ఆధారంగా గ్రామ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత మేరకు ఖర్చు చేయవచ్చనే విషయాన్ని నిర్ణయించారు.ఎన్నికల్లో పారదర్శకత,సమతుల్యాన్ని కాపాడేందుకు ఈ ఖర్చు పరిమితిని విధించారు. గ్రామ పంచాయతీలోని ఓటర్ల సంఖ్యను బట్టి సర్పంచ్,వార్డు సభ్యుల అభ్యర్థులకు ఖర్చు పరిమితులు నిర్ణయించారు.5వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో గరిష్టంగా రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.వార్డు సభ్యడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.50వేలు ఖర్చు చేసేందుకు వీలుంది.5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.వార్డు సభ్యడిగా పోటీ చేసేవారు రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు.ఈ నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల ఖర్చు లెక్కలను కూడా పారదర్శకంగా నిర్వ హించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఖర్చు చేయాల్సింది ఇంతే.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


