నవతెలంగాణ-హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తల్లి మరణిస్తుంది.. చిన్నపిల్లాడు ఏ దిక్కూ లేక బిచ్చగాడవుతాడు..! తల్లి మరణించిన తరువాత ఆ బిడ్డకు ఆ తల్లి ఇస్తున్న ధైర్యం, దీవెన తల్లికీ బిడ్డకు మధ్య ఉండే అమూల్యమైన బంధానికి అద్దంపడుతుంది. ఆ పాట ప్రతీ గుండెను కదిలిస్తుంది. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర చిత్రం నుంచి ఎమోషనల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఇప్పటికే వరుసగా ఈ చిత్రం నుంచి వీడియో సాంగ్స్‌ను మేకర్స్ విడుదల చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఇందులోని ” బడిలో చెప్పని పాఠం ఇదిరా.. బతికే నేర్చుకో నా కొడుకా ” అనే ఎమోషనల్ పాట వీడియో వచ్చేసింది. నంద కిశోర్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సింధూరి విశాల్ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికైన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘నా కొడుకా’ పాట టాప్ ట్రెండింగ్‌లో వైరల్ అవుతోంది. ఇది పాట కాదు.. జీవితం అంటూ ఈ పాట వింటుంటే మా అమ్మ గుర్తొస్తుంది.. ఈ పాట రాసిన నంద కిషోర్‌కి పాదాభివందనం అంటూ సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పాట మాత్రమే కాదు భావోద్వేగ ఝరి అనిపించేటట్టు ఉంటుంది..!
‘ఇది పాట కాదు.. జీవితం’ : ‘కుబేర’ వీడియో సాంగ్ వైరల్ ..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES