నవతెలంగాణ-హైదరాబాద్: రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటించడం దురదృష్టకరమని ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. ఇది ప్రధానుల సంప్రదాయం కాదని పేర్కొన్నారు. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే వెళ్లేవారని.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రధానులంతా ఇదే పాటించారని గుర్తుచేశారు. కానీ దురదృష్టవశాత్తు మన ప్రధాని మాత్రం రెండేళ్ల తర్వాత ఆ సూత్రాన్ని పాటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఘర్షణలు జరిగినప్పుడే వెళ్లుంటే ఎంత బాగుండేదని అభిప్రాయపడ్డారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇక శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. తీవ్ర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మోడీ మణిపూర్‌లో పర్యటిస్తున్నారని ఆరోపించారు.
ఇది ప్రధానుల సంప్రదాయం కాదు: ఎంపీ ప్రియాంకాగాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES