Sunday, February 1, 2026
E-PAPER
Homeజిల్లాలుఇది విచారణ కాదు.. రాజకీయ ప్రతీకారం

ఇది విచారణ కాదు.. రాజకీయ ప్రతీకారం

- Advertisement -

– రాయపోల్ మండల అద్యక్షులు వెంకటేశ్వర శర్మ.
నవతెలంగాణ – రాయపోల్ 

ఇది విచారణ కాదు రాజకీయ ప్రతీకారమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ విచారణ పేరుతో రాజకీయంగా వేధిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది విచారణ కాదు.. రాజకీయ ప్రతీకారం,కేసీఆర్‌ను టార్గెట్ చేయడం ఆపాలి అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో విచారణల పేరుతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం అసహ్యకరమని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆరోపించారు.

ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కేసీఆర్ ప్రజాదరణను తట్టుకోలేకే ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ రాజకీయ వేధింపులకు భయపడదని, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజీరెడ్డి, మంజూర్, బాల్ నర్స్,మధు,సంతోష్, ఇసాక్,సందీప్, నవీన్ గౌడ్, స్వామి,నవీన్,అశోక్,మహేష్, మురళి గౌడ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -