నేటి సమాజానికి ఎంతో అవసరమైన మెసేజ్ అందిస్తూ రమేష్ ఉప్పు హీరోగా, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వీడే మన వారసుడు’. రమేష్ ఉప్పు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది.
సమ్మెట గాంధీ, దేవసేన (వెంకటగిరి), విజయ రంగ రాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈనెల 18న తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతున్నట్టు చిత్ర దర్శక, నిర్మాత రమేష్ ఉప్పు తెలిపారు. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ, ‘ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఒంటరిగా సినిమాల్లో వచ్చిన రమేష్ ఉప్పు.. అసలైన సినీ వారసుడిగా రాణించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘చిత్ర యూనిట్‌కు ముందస్తు శుభాకాంక్షలు. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు సముద్ర చెప్పారు. హీరో కష్ణసాయి మాట్లాడుతూ,’సినిమా రంగంలో అనేక శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రమేష్ ఉప్పును దర్శకరత్న దాసరితో పోల్చడం సమంజసం’ అని తెలిపారు.
దర్శక, నిర్మాత రమేష్ ఉప్పు మాట్లాడుతూ, ‘సమాజానికి మంచి సందేశం అందిస్తుంది మా సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించిన ఈ కుటుంబ కథా చిత్రాన్ని థియేటర్‌కు వెళ్లి చూడాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని చెప్పారు. హీరోయిన్లు లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ మాట్లాడుతూ, ”రమేష్ ఉప్పు ఒక మంచి సినిమాను తెరకెక్కించారు. ఇందులో అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది’ అని అన్నారు.
రైతు కష్టాల నేపథ్యంలో ‘వీడే మన వారసుడు’
- Advertisement -
- Advertisement -