- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ ‘హరి హర వీరమల్లు’ సినిమా కొత్త విడుదల తేదీ వచ్చేసింది. జూన్ 12వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
- Advertisement -