– ఆసీస్ చేతిలో హాకీ అమ్మాయిలు చిత్తు
పెర్త్ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా పర్యటనలో తొలి విజయం వేటలో భారత మహిళల హాకీ జట్టు నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఆసీస్-ఏతో రెండు మ్యాచుల్లో తేలిపోయిన సలీమ టెటె సేన.. ఆస్ట్రేలియాతో తొలి రెండు మ్యాచుల్లోనూ నిరాశపరిచింది. శనివారం పెర్త్ హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 2-3తో భారత్ పరాజయం పాలైంది. మరో మ్యాచ్ ఉండగానే 2-0తో ఆస్ట్రేలియా సిరీస్‌ను సొంతం చేసుకుంది. టీమ్ ఇండియా పోరాట పటమి చూపించినా.. విజయానికి దూరంగానే ఉండిపోయింది. 2వ నిమిషంలోనే గ్రేస్ స్టీవార్ట్ గోల్‌తో ఆసీస్ 1-0తో ముందంజ వేసింది. మూడో క్వార్టర్‌లో పుంజుకున్న భారత్ 35వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. నవనీత్ కౌర్ పీసీ గోల్‌తో 1-1తో స్కోరు సమమైంది. కానీ నిమిషం వ్యవధిలోనే ఆస్ట్రేలియా గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. జేడ్ స్మిత్ ఫీల్డ్ గోల్‌తో భారత్‌ను వెనక్కి నెట్టగా.. 42వ నిమిషంలో గ్రెటా హేస్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆసీస్‌ను 3-1తో తిరుగులేని స్థానంలో నిలిపింది. ఆఖరు వరకు గోల్ ప్రయత్నాలు చేసిన భారత్ 59వ నిమిషంలో సక్సెస్ అయ్యింది. లాల్‌రెమిసియామి 59వ నిమిషంలో గోల్‌తో ఓటమి అంతరాన్ని కుదించింది.
ఈసారి 2-3తో ఓటమి
- Advertisement -
- Advertisement -