- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) అమ్మకాలను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇంజిన్ పనితీరు దెబ్బతినకుండా ఉండేందుకు కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ (RON) ఉండాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల కాలుష్యం 30% వరకు తగ్గుతుందని, రైతులకు మేలు జరుగుతుందని అంచనా. అయితే, పాత వాహనాల్లో మైలేజీ 3-7% తగ్గే అవకాశం ఉంది. 2023 తర్వాత తయారైన వాహనాలకు ఈ ఇంధనం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు.
- Advertisement -



