Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తోటను కాలబెట్టిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి..

తోటను కాలబెట్టిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి..

- Advertisement -

– లాకావత్ నరసింహ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు 
నవతెలంగాణ-గోవిందరావుపేట : మండలంలోని రాంనగర్ మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్ పామాయిల్ తోటను కాలబెట్టిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లాకావత్ నరసింహ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం కాలవడిన పామాయిల్ తోటను బి ఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహ నాయక్ మాట్లాడుతూపామాయిల్ తోటను గుర్తుతెలియని దుండగులు నిప్పంటించడం బాధాకరమని అన్నారు పామాయిల్ తోట మోటరు డ్రిప్స్ పైపులు షాటరు మొక్కలు పూర్తిగా కాలిపోవడం వల్ల రైతుకు మూడు లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. రైతు మోహన్ రాథోడ్ కు జరిగిన నష్టానికి బాధ్యులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని సదురు రైతు మోహన్ రాథోడును హార్టికల్చర్ అధికారులు పరిశీలించి,ప్రభుత్వ ద్వారా ఆదుకోవాలని  డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దారావత్ రాకేష్ సర్పంచ్ ,ఉట్ల పృథ్వి రాజ్ మండలం మీడియా కన్వీనర్ ,మలేష్ గౌడ్,గాంధీ సర్పంచ్, సీతారాం సర్పంచ్, వ్యగా, పున్నం రవి  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -