Tuesday, November 4, 2025
E-PAPER
Homeజిల్లాలుమూడు పాడి ఆవులు మృతి

మూడు పాడి ఆవులు మృతి

- Advertisement -

నవతెలంగాణ కల్వకుర్తి టౌన్

పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవించే ఓ రైతు కుటుంబంలో విషాదం అలుముకుంది. సోమవారం అర్ధరాత్రి మూడు పాడి ఆవులు మృతి చెందాయి. వెల్దండ మండలం తిమ్మినోనిపల్లి గ్రామానికి చెందిన గుమ్మకొండ లింగమయ్య అనే రైతు తన పొలంలో పాడి ఆవులను గుడిసెలో కట్టేశారు. తెల్లవారుజామున పాలు పితకడానికి వెళ్లిన రైతుకు మూడు పాడి ఆవులు చెందడం గమనించి కన్నీరు మున్నిరయ్యారు.

దాదాపు 2 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే ఆవులు మృతి చెందడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడని గ్రామస్తులు అన్నారు. పొలంలో ఉన్న ఆవులు అకస్మాత్తుగా చనిపోవడం బాధాకరమని రైతు అన్నారు. వర్షం సమయంలో పిడుగుపాటుకు చనిపోయి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -