- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. పోటీలో అదుపుతప్పి ఎద్దులు ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 76 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఆవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శివగంగై జిల్లా సింగపునారి సమీపంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
- Advertisement -



