నవతెలంగాణ-హైదరాబాద్: మొజాంబిక్‌లోని బీరా పోర్టు తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారతీయులతో ప్రయాణిస్తున్న ఒక బోటు బోల్తా పడటంతో ముగ్గురు ప్రాణాలు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనను మొజాంబిక్‌లోని భారత హైకమిషన్ అధికారికంగా ధ్రృవీకరించింది. సముద్రంలో లంగరు వేసి ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్‌లోకి సిబ్బందిని తరలించేందుకు 14 మంది భారతీయులతో ఒక బోటు బయలుదేరింది. శుక్రవారం బీరా పోర్టు సమీపంలో ఈ సిబ్బంది బదిలీ ప్రక్రియ జరుగుతుండగా, అనుకోని రీతిలో బోటు నీటిలో బోల్తా పడింది.
ఈ ఘటనలో ఆరుగురు భారతీయులను సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో ఒకరు ప్రస్తుతం బీరాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మరణించినట్లు పేర్కొంది. గల్లంతైన మరో ఐదుగురు సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపింది. ”ఈ దురదృష్టకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మతుల కుటుంబాలతో మేం టచ్‌లో ఉన్నాం. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాం” అని భారత హైకమిషన్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటనలో పేర్కొంది.



