– టాటా ఏఐజీ వెల్లడి
– కొత్తగా మెడికేర్ సెలెక్ట్ ఆవిష్కరణ
నవ తెలంగాణ – హైదరాబాద్
వైద్య బీమా సంస్థ టాటా ఏఐజీ గతేడాది వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో పాలసీల జారీలో మూడు రెట్ల వృద్ధిని సాధించినట్లు వెల్లడించింది. 82,000 పైగా పాలసీదారులకు కవరేజీని అందించడం ద్వారా మెరుగైన ప్రగతిని కనబర్చినట్లు పేర్కొంది. మంగళవారం హైదరాబాద్‌లో టాటా ఏఐజీ ఎజెన్సీ హెడ్ ప్రతీక్ గుప్తా, యాక్సిడెంట్ అండ్ క్లెయిమ్స్ హెడ్ రుద్రరాజు రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. అంతగా వైద్య బీమా సేవలందనీ మార్కెట్ల కోసం కొత్తగా మెడికేర్ సెలెక్ట్ పాలసీని అందుబాటులోకి తెచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1600 పైగా హాస్పిటల్స్‌తో పటిష్టమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నామ న్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాంతంలో 97 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని సాధించామన్నారు. 14,500 అడ్వైజర్లతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, బీమా సేవలను విస్తరిస్తున్నామన్నారు. జాతీయ సగటు 13 శాతంతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో వైద్య వ్యయం 16 శాతం పెరిగిందన్నారు. 2024-25లో నగదు రహిత సేవల వినియోగం తెలంగా ణలో 81 శాతంగా, ఆంధ్రప్రదేశ్‌లో 68 శాతంగా నమోదయ్యిందన్నారు. ప్రస్తుతం వైద్య బీమాలో 3.6 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నామని.. దీన్ని 5 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
పాలసీల జారీలో మూడు రెట్ల వృద్ధి
- Advertisement -