- Advertisement -
నవతెలంగాణ – ఢిల్లీ : భారత సైన్యానికి చెందిన ఓ ట్రక్కు జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ వద్ద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళుతున్న ఆర్మీ వాహనం.. ‘బ్యాటరీ చెష్మా’ అనే ప్రదేశం వద్ద 600 అడుగుల లోయలోకి దొర్లిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు చనిపోయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతి చెందిన సైనికులను అమిత్ కుమార్, సుజిత్ కుమార్, మన్ బహదూర్‌గా గుర్తించినట్లు సైన్యం వెల్లడించింది.
- Advertisement -