Monday, May 5, 2025
Homeజాతీయంఈడీ అధికారాలపై విచారణకు ముగ్గురు జడ్జిలతో ధర్మాసనం

ఈడీ అధికారాలపై విచారణకు ముగ్గురు జడ్జిలతో ధర్మాసనం

- Advertisement -

న్యూఢిల్లీ: ఈడీ అధికారాలను సమర్థిస్తూ 2022లో ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణకు ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు పునర్ని ర్మించింది. జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.కొటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను ఈ నెల 7 నుంచి విచారించనుంది. గతంలో ఈ ధర్మాసనాన్ని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సిటి రవికుమార్‌లతో ఏర్పాటు చేసింది. అయితే వీరిలో జస్టిస్‌ రవికుమార్‌ జనవరి 5న పదవీ విరమణ చేశారు. దీంతో మార్చి 6 నుంచి జరగాల్సిన పిటి షన్ల విచారణ నిలిచిపోయింది. కాగా, మనీలాండ రింగ్‌ నిరోధక చట్టం కింద సోదాలు, ఆస్తిని స్వాదీనం చేసుకోవడం, వ్యక్తులను అరెస్టు చేయడం వంటి అధికారాలు ఈడీకి ఉంటా యని సమర్థిస్తూ 2022 జులైలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే అదే సంవత్సరం ఆగస్టులో ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ అనేక పిటిషన్లు దాఖల య్యాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు (ఈసీఐఆర్‌), పోలీసులు నమోదు చేసే ఎఫ్‌ఐఆర్‌ ఒక్కటి కాదని పిటిషన్‌దారులు వాదించారు. దీంతో ఈ పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -