- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదివారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీలేరు మండలం బాలమువారిపల్లి వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. జేసీబీ సహాయంతో కారును బావిలో నుంచి తీయించి, మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -