- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భార్యాభర్తలు, కుమార్తె మృతి చెందగా.. కుమారుడికి గాయాలయ్యాయి. వీరంతా రుక్మాపూర్ నుంచి బైక్పై జహీరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



