- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారీ వర్షాల వేళ తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యార్థులు, ఒక అటెండర్‌కు కరెంట్ షాక్ తగిలింది. పాఠశాల పైనుంచి జెండాను కిందకు తీసుకొస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురు సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఉపాధ్యాయులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -