నవతెలంగాణ-హైదరాబాద్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుజరాత్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక టీమ్(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. అదుపులోకి తీసుకున్నవారిపై ఏడాది కాలంగా అధికార బృందాలు నిఘావేసి ఉంచినట్టు ఏటీఎస్ వెల్లడించింది. నిందితులు దేశంలో ఏదో పెద్ద ఉగ్రకుట్రకే పన్నాగం పన్నినట్లు చెప్పిన ఏటీఎస్.. అందుకోసం వారు ఇటీవల ఆయుధాల మార్పిడి కోసం గుజరాత్‌లో సంచరించినట్టు తెలిపింది. ముగ్గురిలో.. ఇద్దరు పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్(UP)కు చెందిన వారు కాగా, మరొకరు హైదరాబాద్(Hyderabad) వాసిగా ఏటీఎస్ గుర్తించింది. ఈ ముగ్గురూ ఉగ్రవాదంపై ప్రత్యేక శిక్షణ పొందారని, వారి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని తేల్చింది. వీరంతా రెండు వేర్వేరు సంస్థల ఉగ్ర మాడ్యూళ్లలో భాగమని తెలిపింది.
గుజరాత్‌లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



