- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందారు. ఆస్పత్రిలోని 50 అడుగుల లోతైన మురుగునీటి ట్యాంక్‌ను ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా శుభ్రం చేయడానికి దిగిన కార్మికులు విషవాయువులను పీల్చి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన ఆస్పత్రి యాజమాన్యంపై తీవ్ర విమర్శలకు దారితీసింది.
- Advertisement -



