నవీన్ చంద్ర హీరోగా, మీనాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా అనిల్ సుంకర సమర్పణలో స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో కిషోర్ గరికిపాటి నిర్మించిన చిత్రం ‘షో టైమ్’. ఈ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హీరో అడవి శేషు చేతుల మీదుగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు.
హీరో నవీన్ చంద్ర నటనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే బ్యూటీఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో ఒక అద్భుతమైన పాత్రతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనుంది. విభిన్న పాత్రలతో అలరించే రాజా రవీంద్ర ఈ సినిమాలో మరో అద్భుతమైన పాత్రలో కనిపిస్తారు. అలాగే విలక్షణ నటుడు నరేష్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారు అని మేకర్స్ తెలిపారు. వినూత్నమైన పాత్రలతో పాటు అద్భుతమైన సినిమాలను అందించే హీరో నవీన్ చంద్ర నుంచి వస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. దీనికి సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రాఫర్: టీ వినోద్ రాజా, ఎడిటర్: శరత్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ : సుప్రియ బట్టేహపాటి, డైలాగ్స్ : శ్రీనివాస్ గవిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్స్: చంద్రశేఖర్ మహదాస్, పుష్య మిత్ర గంట.
థ్రిల్ చేసే ‘షో టైమ్’
- Advertisement -
- Advertisement -