అనిల్ సుంకర సమర్పణలో స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం ‘షో టైమ్’. మదన్ దక్షిణామూర్తి దర్శకుడు. కిషోర్ గరికిపాటి నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. నవీన్ చంద్ర హీరోగా, కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ థ్రిల్లర్ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ, ‘ఈ సినిమాకు పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతీ యాక్టర్ అద్భుతంగా చేశారు. చాలా కొత్త పాయింట్‌తో చాలా ఫ్రెష్‌గా ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుంది’ అని అన్నారు. ‘చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు. కాన్సెప్ట్ బాగుంటే సినిమా చాలా బాగా ఆడుతుంది. ఇందులో నాకొక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తికి ధన్యవాదాలు’ అని రాజారవీంద్ర చెప్పారు. దర్శకుడు మదన్ దక్షిణామూర్తి మాట్లాడుతూ,’ పరిశ్రమలో ఒక పెద్ద వ్యక్తి సినిమా చూసి ఇది రియల్ షో టైం అని అభినందించడం చాలా ఆనందంగా ఉంది. దీంతో సినిమా ఫలితంపై చాలా నమ్మకంగా ఉన్నాం’ అని అన్నారు. ‘ఈ సినిమా అందరికి నచ్చుతుంది. చిన్న సినిమా కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమా. నవీన్ చంద్ర అద్భుతమైన నటుడు’ అని హీరోయిన్ కామాక్షి భాస్కర్ల చెప్పారు. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ,’చాలా మంచి సినిమా చేసినప్పుడు ఆసక్తితో పాటు ఉత్సాహం, భయం కూడా ఉంటుంది. డైరెక్టర్ మదన్‌తో పని చేయడం చాలా బాగా అనిపించింది. ఎడిటర్ శరత్, డీఓపీ వినోద్ శ్రమ ఎంతో ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్రతో పని చేయడం చాలా మంచి అనుభూతినిచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది’ అని తెలిపారు.