Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలు‘థగ్‌ లైఫ్‌’ నుంచి ‘జింగుచా’ తెలుగు ఫస్ట్‌ సింగిల్

‘థగ్‌ లైఫ్‌’ నుంచి ‘జింగుచా’ తెలుగు ఫస్ట్‌ సింగిల్

నవతెలంగాణ-హైదరాబాద్ : లోక‌నాయ‌కుడు కమల్‌హాసన్ హీరోగా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మణిరత్నం దర్శకత్వంలో కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. ‘నాయగన్‌’ (నాయకుడు 1987) త‌ర్వాత దాదాపు 37 ఏండ్ల త‌ర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుండ‌డంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ రంగరాయ శక్తివేల్‌ నాయకర్ అనే శ‌క్తివంత‌మైన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. త్రిష కథానాయికగా న‌టిస్తుంది. శింబు, అశోక్ సెల్వ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ 05 2025న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ప్ర‌మోష‌న్స్ షూరు చేసింది చిత్ర‌యూనిట్. ఇప్ప‌టికే టీజ‌ర్‌ను వ‌దిలిన టీం తాజాగా తెలుగు ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల చేసింది. జింగుచా అంటూ సాగే ఈ పాట‌కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

https://www.youtube.com/watch?v=dTTkXxy7BW4

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img