Sunday, June 1, 2025
E-PAPER
Homeసినిమా'థగ్‌ లైఫ్‌' చాలా గొప్ప సినిమా : కమల్‌హాసన్‌

‘థగ్‌ లైఫ్‌’ చాలా గొప్ప సినిమా : కమల్‌హాసన్‌

- Advertisement -

కమల్‌ హాసన్‌ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన హై-ఓక్టేన్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. జూన్‌ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని హీరో నితిన్‌ ఫాదర్‌ ఎన్‌ సుధాకర్‌ రెడ్డి శ్రేష్ఠ్‌ మూవీస్‌ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నారు. గతంలో ‘విక్రమ్‌, అమరన్‌’ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్‌ లైఫ్‌’ను భారీగా రిలీజ్‌ చేయబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. హీరో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ,’వైజాగ్‌ ప్రజలు నన్ను ఎంతగానో దగ్గరకి తీసుకున్నారు. ఈ వైజాగ్‌లో ‘మరో చరిత్ర’. ‘సాగర సంగమం’, ‘ఏక్‌ తుజే కేలియే’, ‘శుభసంకల్పం’ సినిమాలు చేశాను. ఇది నాకు సొంత ఇల్లు లాంటిది. నేను 15 తెలుగు సినిమాలు చేస్తే అందులో 13 విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. ఆ విజయాల్ని మీరే ఇచ్చారు. ప్లాప్స్‌ మాత్రమే నేను ఇచ్చాను. ఇది నిజం. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి ఈ సినిమా మీకు అందిస్తున్నాను. ఇది చాలా గ్రేట్‌ ఫిలిం ఇది. శింబు బెస్ట్‌ పెర్ఫార్మన్స్‌ ఇచ్చారు. నెవర్‌ బిఫోర్‌ క్యారెక్టర్‌లో కనిపించారు. అభిరామి అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. నాజర్‌తో నాది వెరీ లాంగ్‌ జర్నీ. ఆయన లాంటి నటుడు దొరకడం చాలా కష్టం. త్రిష పెర్ఫార్మెన్స్‌ని చాలా ఎంజారు చేస్తారు. చాలా గొప్ప సినిమా చేశామని మేము నమ్ముతున్నాం. జూన్‌ 5న మేము అనుకున్నది కరెక్టా లేదా అనేది మీరు సినిమా చూసి చెప్పాలి. ఈ సినిమాకి మీరు ఇచ్చే రియాక్షన్‌ కోసం ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. ”వర్షం’ సినిమా రిలీజ్‌ 22 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా కతజ్ఞతలు. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌తో ఫస్ట్‌ టైం కలిసి వర్క్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఇంద్రాణి అనే క్యారెక్టర్‌ చేశాను. తప్పకుండా ఆడియన్స్‌కి గుర్తుండిపోయే పాత్ర ఇది’ అని హీరోయిన్‌ త్రిష చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -