నవతెలంగాణ-హైదరాబాద్: కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెపితే సమస్య పరిష్కరమువుతుందని కర్నాటక హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందన్న వ్యాఖ్యలను.. ఏ ఆధారాలతో చేశారని, మీరేమైనా చరిత్రకారులా అని కర్నాటక హైకోర్ట్ కమల్‌ను ప్రశ్నించింది. తన సినిమా “థగ్ లైఫ్” జూన్ 05 న కర్ణాటకలో విడుదల కావడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టును కమల్ హసన్ ఆశ్రయించారు. నేడు ఆయన పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కమల్ హాసన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.
కొద్ది రోజుల క్రితం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. దీంతో కన్నడ భాష సంఘంతోపాటు పలువురు కవులు, రాజకీయ నేతలు ఆయన మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కమల్ హసన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కన్నడియులు డిమాండ్ చేశారు. కానీ కమల్ క్షమాపణ చెప్పాడానికి నిరాకరించారు. దీంతో ఆయన సినిమాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కమల్ హసన్ కోర్టులో సవాల్ చేశారు. సారీ చెపితే సమస్య ఎండ్ కార్డు పడుతుందని ధర్మాసనం హితువు పలికింది. తప్పులు అందరూ చేస్తారని, సరిదిద్దుకోవడంతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంది.