Saturday, February 14, 2026
E-PAPER
Homeజాతీయంటిక్కెట్లు బుక్ చేశా.. మ‌ణిపూర్‌లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌టించాలి: ఎంపీ ప‌వ‌న్ ఖేరా

టిక్కెట్లు బుక్ చేశా.. మ‌ణిపూర్‌లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌టించాలి: ఎంపీ ప‌వ‌న్ ఖేరా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌ధాని మోడీ అసోంలోనే కాద‌ని మ‌ణిపూర్‌లో ప‌ర్య‌టించాల‌ని కాంగ్రెస్ ఎంపీ ప‌వ‌న్ ఖేరా డిమాండ్ చేశారు. ప్ర‌ధాని కోసం టిక్కెట్లు కూడా బుక్ చేసిన‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. 2003 నుంచి మ‌ణిపూర్ ఘ‌ర్ష‌ణ‌ల‌తో మండిపోతుంద‌ని, ఎన్నిక‌ల వేళ అసోంలో ప‌ర్య‌టించ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌లు ఎక్కువ‌గా ఎన్నిక‌ల జ‌రిగే రాష్ట్రాల్లోనే ప‌రిమిత‌మ‌ని, ఆ రాష్ట్రాల‌కే మోడీ అధిక ప్రాధాన్య‌త ఇస్తార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

మ‌ణిపూర్ వ‌స్తే ఎవ‌రూ పీఎంని నిర్భందించారని, అసోం నుంచి కేవ‌లం గంటలోపే మ‌ణిపూర్‌కు రావ‌చ్చున‌ని ఎక్స్ వేదిక‌గా చెప్పారు. దయచేసి మణిపూర్‌లోని ప్రజలకు ప్ర‌ధాని భరోసా ఇవ్వాలి, ప్రధానమంత్రి కోసం గౌహతి నుండి ఇంఫాల్‌కు ఫ్లైట్‌ని కూడా బుక్ చేసాం, పీఎం కేవలం విమానంలో ఎక్కాలి, మోడీ నంబర్ త‌న దగ్గర లేద‌ని, ఆయన‌ విమాన టిక్కెట్టును ఇక్కడ షేర్ చేస్తున్నాన‌ని ఎంపీ పేర్కొన్నారు. త్వరలోనే అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ పర్యటన అసోంలో ప‌ర్య‌టిస్తున్నారు. గత మూడు నెలల్లో అస్సాంకు మోడీ రావడం ఇది మూడవసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -