Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్జిల్లాలో రాష్ట్ర మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత

జిల్లాలో రాష్ట్ర మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత

- Advertisement -
  • – జిల్లా ఎస్పీ మహేష్ బి గితే


నవతెలంగాణ సిరిసిల్ల
రుద్రంగి మండలంలో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే పేర్కొన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించి దిశానిర్దేశం  చేసిన అనంతరం ఎస్పి మాట్లాడుతూ సభ ప్రాంగణంలో, విఐపి/జనరల్ గ్యాలరిలో, రూట్ బందోబస్తు,విఐపి పార్కింగ్/జనరల్ పార్కింగ్ ప్రదేశలలో బందోబస్తులో ఉన్న అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,అదనపు ఎస్పీ చంద్రయ్య,సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ, డి సి ఆర్ బి డిఎస్పీ శ్రీనివాస్,సి.ఐ లు మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, మధుకర్, నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఆర్.ఐలు రమేష్, మధుకర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad