- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్:
అత్తాపూర్ ప్రాంతంలో టిప్పర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన ఉపరపల్లి మెట్రో పిల్లర్ 191 దగ్గర చోటుచేసుకుంది. అక్కడే విధులో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి టిప్పర్ దూసుకెళ్లటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రాంతంలో విషాద వాతావరణం ఏర్పడింది. అతి వేగంగా వస్తున్న వాహనాలను నియంత్రించడానికి పోలీసులు అక్కడి రహదారులను మూసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు పరిశీలనలు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
- Advertisement -



