- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై మొహబ్బత్‌నగర్ గేటు సమీపంలో సోమవారం సాయంత్రం కారును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రాత్లావత్ బద్రు కుమారుడు బిట్టు (4) అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో కారు చోదకుడితో పాటు మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంగళవారం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
- Advertisement -



