Sunday, May 18, 2025
Homeతాజా వార్తలుట్యాంక్‌బండ్‌పై ‘తిరంగా ర్యాలీ’.. పాల్గొన్న ప్రముఖులు

ట్యాంక్‌బండ్‌పై ‘తిరంగా ర్యాలీ’.. పాల్గొన్న ప్రముఖులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయాన్ని పురస్కరించుకొని, మన దేశ సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ ట్యాంక్‌ బండ్‌ రోడ్డులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. భారత్‌ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న డాక్టర్‌. బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ప్రారంభమైన ‘తిరంగా ర్యాలీ’.. సచివాలయం జంక్షన్‌ మీదుగా సైనిక ట్యాంక్‌ వరకు కొనసాగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -