నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ లోని విజయవాడలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు తిరంగ యాత్ర నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు భారతీయ జనతా పార్టీ , తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్రలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , రాజమండ్రి ఎంపీ, ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితోపాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొన్నారు. ఈ యాత్ర ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సాగింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన దేశవ్యాప్త ‘తిరంగ యాత్ర’లో భాగంగా నేడు ఏపీలో భారీ యాత్ర ఘనంగా నిర్వహించారు. సుమారు 5000 మంది పాల్గొన్న ఈ యాత్రలో జాతీయ జెండాలు చేపట్టి, దేశభక్తి నినాదాలు ఇస్తూ.. భారత సైనికులకు మద్ధతు తెలిపారు.
విజయవాడలో తిరంగ యాత్ర.. పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES