- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో క్యూలైన్లలో రద్దీ తగ్గి, దర్శనాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఇక సమయ నిర్దేశిత (SSD) టోకెన్లు పొందిన భక్తులకు 2 నుంచి 4 గంటలు, ఇక రూ.300 శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన వారికి 2 గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతోంది.
- Advertisement -



