Friday, May 2, 2025
Homeఆటలులార్డ్స్‌లో టైటిల్‌ పోరు

లార్డ్స్‌లో టైటిల్‌ పోరు

– 2026 మహిళల టీ20 ప్రపంచకప్‌
దుబాయ్‌:
ఐసీసీ మహిళల 2026 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చారిత్రక లార్డ్స్‌ స్టేడియం వేదిక కానుంది. 2017 ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్‌ పోరు సైతం లార్డ్స్‌లో జరుగగా.. అభిమానుల నుంచి విశేష ఆదరణ లభించింది. 2026 టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ పోరుకు సైతం లార్డ్స్‌ను ఖరారు చేస్తూ ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తీసుకుంది. లార్డ్స్‌ సహా మరో ఆరు స్టేడియాలు మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 12 జట్లు పోటీపడనున్న టీ20 వరల్డ్‌కప్‌లో 33 మ్యాచులను 24 రోజుల్లో షెడ్యూల్‌ చేశారు. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌, హీడింగ్లే, ఎడ్జ్‌బాస్టన్‌, హంప్‌షైర్‌బౌల్‌, ది ఓవల్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌లు సైతం టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్య వేదికల జాబితాలో ఉన్నాయి. జూన్‌ 12న ఆరంభ మ్యాచ్‌, జులై 5న ఫైనల్‌ జరుగనుంది. ఆతిథ్య ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, భారత్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, శ్రీలంక నేరుగా అర్హత సాధించగా.. మరో నాలుగు జట్లు అర్హత టోర్నీల నుంచి రానున్నాయి. 2020 మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మెల్‌బోర్న్‌లో జరుగగా.. రికార్డు స్థాయిలో 86,174 మంది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img