నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ను టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో విజయం సాధించి కామారెడ్డి పురపాలక సంఘం నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం పురపాలక సంఘం కార్యాలయంలోని చైర్మన్ చాంబర్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్‌కు టీఎన్జీవోస్ నాయకులు పుస్తకాలు అందజేసి ఘనంగా సత్కరించి, జిల్లా శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణాభివృద్ధి, సిబ్బంది సంక్షేమం వంటి అంశాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఎం. నాగరాజు, సహాధ్యక్షులు ఎం. చక్రధర్, కోశాధికారి ఎం. దేవరాజు, కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు కె. శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రాజ్యలక్ష్మి, జాయింట్ సెక్రెటరీ రాజమణి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంతోష్ కుమార్‌తో పాటు జిల్లా ఇరిగేషన్ శాఖ, ఆర్ అండ్ బి శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్‌ను కలిసిన టీఎన్జీవోస్ జిల్లా బృందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



