Monday, July 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫొటోగ్రాఫర్‌ భూపాల్‌ కుమార్‌కు

ఫొటోగ్రాఫర్‌ భూపాల్‌ కుమార్‌కు

- Advertisement -

‘కెనాన్‌’ జాతీయ గుర్తింపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ మెంటర్‌గా భూపాల్‌కుమార్‌కు ప్రఖ్యాత కెనాన్‌ కంపెనీ జాతీయ గుర్తింపునిచ్చింది. తన వృత్తి ద్వారా ఆయన ప్రపంచంలోనే గణనీయమైన ప్రభావాన్ని చూపారు. అతని అత్యుత్తమ ప్రతిభను కెనాన్‌ ఇండియా గుర్తించింది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో వర్క్‌షాప్‌లను నిర్వహించినందుకు ఆయనకు కంపెనీ రూ.2లక్షల నగదు బహుమతి ప్రకటించింది. గతేడాది తెలుగు రాష్ట్రాల్లో ఆయన వేలాది మంది ఫొటోగ్రాఫర్లకు శిక్షణ ఇచ్చి శభాష్‌ అనిపించుకున్నారు. ఫొటోగ్రఫీ పట్ల ఆయనకున్న అంకితభావానికి, ఇతరులకు సహకారం అందించడంలో ఆయనకున్న నిబద్ధతకు ఈ గుర్తింపు నిదర్శనం. ఫోటోగ్రఫీని ప్రోత్సహించడంలోనూ, తన నైపుణ్యాన్ని ఇతరులకు పంచడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. నేపాల్‌ దేశం ఖాట్మండులో జరిగిన ఫోటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో ‘ఫొటోటెక్‌’ చైర్మెన్‌ అభిమాన్యు ఆయన్ను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -