నవతెలంగాణ – హైదరాబాద్: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అమరావతి పర్యటనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో సమావేశం కానున్నారు. విద్య, వైద్య, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. బిల్ గేట్స్‌తో పాటు ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాల్గొంటుంది. సచివాలయంలో తొలుత రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) కేంద్రాన్ని వారు సందర్శిస్తారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగం, దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్‌కు వివరించనున్నారు. అనంతరం ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ లక్ష్యాలు, వివిధ రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
నేడు ఏపీకి బిల్ గేట్స్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



