నవతెలంగాణ-హైదరాబాద్: నేడు సావిత్రిబాయి పూలే జయంతి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆమెకు నివాళులర్పించారు. సేవ, విద్య ద్వారా సమాజ పరివర్తనకు తన జీవితాన్ని అంకితం చేసిన మార్గదర్శక సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే అని మోడీ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సేవ, విద్య ద్వారా సమాజ పరివర్తనకు జీవితాన్ని అంకితం చేసిన మార్గదర్శకురాలిని మనం గుర్తు చేసుకుంటున్నాము’ అని ఆయన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అలాగే సావిత్రిబాయి పూలే సమానత్వం, న్యాయం, కరుణ సూత్రాలకు కట్టుబడి ఉన్నారు. సామాజిక మార్పుకు విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని పూలే దృఢంగా విశ్వసించారని మోడీ పేర్కొన్నారు. జ్ఞానం, సాధన ద్వారా జీవితాలను మార్చడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. దుర్బలమైన అణగారిన వర్గాలకు పూలే చేసిన కృషి, సేవ మానవత్వానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచారు. సమ్మిళిత, సాధికారత కలిగిన సమాజాన్ని నిర్మించడంలో దేశం చేస్తున్న ప్రయత్నాలకు పూలే దార్శనికత నిరంతరం మార్గనిర్దేశం చేస్తుందని మోడీ అన్నారు.
నేడు సావిత్రిబాయి పూలే జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



